ఇష్టం లేకపోయినా దాని కోసమే పెళ్లి చేసుకున్నానంటున్న తెలుగు హీరోయిన్… దాంతో నెటిజన్లు…

By | November 3, 2020

మన నిత్య జీవితంలో పెద్దలు “పెళ్ళంటే నూరేళ్ళ పంటని అంతేగాక రెండు నిండు మనసుల కలయికతో మరో కొత్త జీవితానికి నాంది పలికే అపురూపమైన ఘట్టమని” పెళ్లి గురించి ఎంతో గొప్పగా చెబుతుంటారు.కానీ కొందరు చేసేటటువంటి పనుల కారణంగా రానురాను పెళ్లిపై నమ్మకం లేకుండా పోతుంది.

తెలుగులో ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన “రక్త చరిత్ర” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయిన “బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు తెలుగులో నటించింది కొన్ని చిత్రాలలోనే అయినప్పటికీ పలు రకాల విభిన్న పాత్రలలో నటించి సినీ విమర్శకుల నుంచి నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది.

అయితే తాజాగా ఈ అమ్మడు పెళ్లి పై చేసినటువంటి వ్యాఖ్యల కారణంగా సోషల్ మీడియా మాధ్యమాలలో రాధిక ఆప్టే  పై  నెగిటివ్ ట్రోల్స్ మొదలయ్యాయి.ఇటీవలే రాధిక ఆప్టే తనకి పెళ్లి చేసుకోవడం “ఏ మాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ” వీసా కోసమే తన భర్త బెండిక్ట్ టైలర్ ని పెళ్లి చేసుకున్నానని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ పెళ్లంటే సినిమా కాదని ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నిండు నూరేళ్ళ పాటు సంతోషంగా జీవించడమని అంతేగాని ఆస్తుల కోసం, డబ్బు కోసం, ఇలా వీసాల కోసం పెళ్లి చేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.అంతేకాక తమ చిత్రాల ద్వారా మంచి చెడులను సభ్య సమాజానికి తెలియజేసేటువంటి సెలబ్రిటీలే పెళ్లి పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల సామాన్య ప్రజలు తప్పుదోవ పడతారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రాధిక ఆప్టే బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.ఇందులో భాగంగా ప్రస్తుతం రాధిక ఆప్టే హిందీలో “ద లాస్ట్ నైట్ ఈజ్ లోన్లీ” అనే థ్రిల్లర్ డ్రామా చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.