చమ్మక్ చంద్ర గురించి మీకెవ్వరికి తెలియని కొన్ని షాకింగ్ నిజాలు

By | November 4, 2020

ఈ టీవీ లో ప్రతి గురువారం మరియు శుక్రవారం ప్రసారం అయ్యే జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్డస్త్ షోలకి ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, సుమారు 8 సంవత్సరాల నుండి విరామం లేకుండా కొనసాగుతున్న ఈ షో ద్వారా ఎంతో మంది హాస్య నటులు తెలుగు సినీ ఇండస్ట్రీ కి పరిచయం మోస్ట్ వాంటెడ్ కమెడియన్స్ గా కొనసాగుతున్నారు, వారిలో ఒక్కరు చమ్మక్ చంద్ర, తన డిఫరెంట్ స్లాంగ్ తో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను జబర్దస్త్ షో ద్వారా కడుపుబ్బా నవ్వించిన చమ్మక్ చంద్ర కి టాలీవుడ్ మెల్లిగా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి, తొలుత వెండితెర మీద చిన్న చిన్న పాత్రలతో మొదలైన చమ్మక్ చంద్ర సినీ కెరీర్ ఇప్పుడు ప్రతి ఒక్క స్టార్ హీరో సినిమాలో తప్పనిసరిగా నటించే రేంజ్ ని సంపాదించుకున్నాడు , ఒక్క పక్క కమెడియన్ గా తన సినిమా కెరీర్ ని విజయవంతంగా కొనసాగిస్తున్న చమ్మక్ చంద్ర మరోపక్క తనకి అన్నం పెట్టిన జబర్దస్త్ షో ని వదలకుండా ఇప్పటికి ఆ షో లో స్కిట్స్ చేస్తూ వస్తున్నాడు.

ఇక చమ్మక్ చంద్ర వ్యక్తిగత విషయానికి వస్తే తెలంగాణ లోని వెంకటాపూర్ నిజామాబాద్ జిల్లాలో జన్మించిన చమ్మక్ చంద్ర కి తోలి సినిమాలు అంటే అమితాసక్తి ఉండేది, దర్శకుడు తేజ కొత్త టాలెంట్ ని వెలికి తియ్యడం లో ఎప్పుడు ముందు ఉంటారు అన్న సంగతి మన అందరికి తెలిసిందే, అప్పట్లో ఆయన తియ్యబోతున్న కొత్త సినిమా ‘జై’ నూతన నటీనటుల కోసం చేస్తున్న ఆడిషన్స్ లో పాల్గొన్న చమ్మక్ చంద్ర త్౫ణ టాలెంట్ తో దర్శకుడు తేజ ని విశేషంగా ఆకర్షించి ఆ సినిమాలో ఒక్క చిన్న క్యారెక్టర్ లో నటించే ఛాన్స్ కొట్టేసాడు, ఆ తర్వాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తానూ ప్లాన్ చెయ్యబోతున్న జబర్దస్త్ కామెడీ షో లో చేసేందుకు అవకాశం కల్పించాడు, తొలుత ఆయన జబర్దస్త్ లో ధన్ రాజ్ మరియు వేణు స్కిట్స్ లో ఒక్కడిగా నటించగా, అతనిలోని టాలెంట్ ని గుర్తించిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి అతనికి ఏకంగా టీం ని మైంటైన్ చేసే అవకాశం కలిపించాడు, ఆ తర్వాత చమ్మక్ చంద్ర తన కమెడీ టైమింగ్ తో ఏ స్థాయిలో ఎదిగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇది ఇలా ఉండగా చమ్మక్ చంద్ర తెలంగాణ కి చెందిన ఒక్క అమ్మాయి ని పెళ్లి చేసుకొని తన పర్సనల్ లైఫ్ ని ఎంతో అద్భుతంగా అనుభవిస్తున్నాడు, ఈయనకి ఒక్క కొడుకు కూడా ఉన్నాడు, చమ్మక్ చంద్ర ఫామిలీ ఫోటోలను ఎక్సక్లూసివ్ గా మీరు క్రింద చూడవచ్చు, ఇది ఇలా ఉండగా 2020 వ సంవత్సరం లో చమ్మక్ చంద్ర కమెడియన్ గా నటించిన అలా వైకుంఠపురం లో చిత్రం ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, చమ్మక్ చంద్ర కామెడీ టైమింగ్ విపరీతంగా ఇష్టపడే త్రివిక్రమ్ ఇటీవల ఆయన తీసే ప్రతి సినిమాలోనూ చమ్మక్ చంద్ర కి ఒక్క ముఖ్యమైన కామిక్ రోల్ ఇస్తూ వస్తున్నాడు, అ ఆ సినిమా తో ప్రారంభం అయినా వీళ్లిద్దరి కాంబినేషన్ ఆ సినిమా తర్వాత వచ్చిన అజ్ఞాతవాసి , అరవింద సామెత మరియు అలా వైకుంఠపురం లో సినిమా వరుకు కొనసాగుతూ పోతుంది, భవిష్యత్తు లో కూడా కామెడీ రోల్స్ కి సినిమాల్లో చమ్మక్ చంద్ర కి ఆఫర్లు క్యూ కడుతూనే ఉన్నాయి ,మరి ఆయన స్థాయి ఏ రేంజ్ కి వెళ్తుందో తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.