జీవిత మాట్లాడిన ఈ మాటలు వింటే కన్నీళ్లు ఆపుకోలేరు

By | November 4, 2020

కరోనా మహమ్మారి దాటికి ప్రపంచం మొత్తం ఎలా స్తంభించి పోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఒక్క సంవత్సరం లోపే వైరస్ భారిన పది ఇంత మంది చనిపోవడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు, చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితం లో చీకటి నింపిన ఈ మహమ్మారి విరుడుగుకి ఇప్పటికి మందు కనిపెట్టడం శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కట్లేదు, కరోనా ప్రభావం తగ్గిందిలే అని ఆనందపడే మరుసటి రోజు నుండే దీని ఇది విజృంభిస్తుంది, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ రెండవ స్టేజి వ్యాప్తి చెందుతుంది అట, ఈ రెండవ స్టేజి మొదటి స్టేజి కంటే దారుణంగా ఉండబోతుంది అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు, ఈ కరోనా దాటికి సామాన్య ప్రజలతో పాటు నిత్యం సురక్షితంగా ఉండే సినీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులకి కూడా సోకి మరణించడం మనం చూస్తూ ఉన్నాము, ఇటీవలే ఘాన గంధర్వుడు ఎస్ పీ బాలసుబ్రమణ్యం గారు ఈ కరోనా మహమ్మారి సోకి ప్రాణాలను విడిచిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సంఘటన జరిగి నెల రోజులు పూర్తి కాకముందే మరో ప్రముఖ హీరో రాజశేఖర్ కి కూడా కరోనా సోకడం అందరిలో ఆందోళనను చెలరేగేలా చేసాయి ,అయితే ఈరోజు ఆయన సతీమణి జీవిత ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడిన మాటలు రాజశేఖర్ అభిమానులను మరియు సినీ ప్రముఖులను ఆనందింపేలా చేసాయి.

ఈరోజు ఆమె మీడియా ముందుకి వచ్చి మాట్లాడుతూ ‘ రాజశేఖర్ గారి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల ప్రార్థనలు మరియు శ్రేయోభిలాషుల చల్లని ప్రార్థనలు ఆయనకీ శ్రీ రామ రక్షా లాగ మారాయి, త్వరలోనే ఆయన పూర్తి స్థాయిలో కోలుకొని మన ముందుకి వస్తాడు అనే ఆత్మ విశ్వాసం మా అందరి లో ఉంది , అయితే సోషల్ మీడియా లో కొన్ని వెబ్ సైట్లు మరియు యూట్యూబ్ చానెల్స్ రాజశేఖర్ ఆరోగ్యం విషమం అని పిచ్చి వ్రాతలు రాస్తున్నారు, ఒక్క మనిషి ఆరోగ్యం గురించి ఇలా అసత్యాలు రాస్తే ఆ కుటుంబం ఎంత బాధకు లోను అవుతుందో ఆలోచించరా అసలు?, వ్యూస్ కోసం , డబ్బుల కోసం నోటికి ఏది తోచితే అది రాసేస్తారా?, ఆలా రాసి సంపాదించిన డబ్బు తో మీరు తినాలి అనుకుంటే అది మీకు విషం అవుతుంది, దయచేసి ఇలాంటి వ్రాతలు ఇప్పటికావున మానండి, మీకు ఒక్కవేల తెలియకపోతే మమల్ని కాంటాక్ట్ అయ్యి తర్వాత వ్రాయండి’ అంటూ జీవిత ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు.

రాజశేఖర్ కి కరోనా సోకింది అనే వార్త బయటకు రాగానే యావత్తు సినీ లోకం ఆందోళనకు గురి చెందింది, ఆయన ఎలా అయినా కోలుకోవాలి అని ప్రముఖ సినీ హీరోలు మరియు రాజకీయ నాయకులూ మీడియా ముఖంగా ప్రార్థనలు చేసారు, ఎట్టకేలకు ఆయన చిన్నగా కోలుకుంటున్నారు అనే వార్త బయటకి రావడంతో ఇప్పుడు అందరూ రిలాక్స్ అయ్యారు, స్వతహాగా మంచి డాక్టర్ అయినా హీరో రాజశేఖర్ ఎంతో మంది నిరుపేదలకు మరియు సినిమా కార్మికులకు ఉచితంగా వైద్యం చేసి వారి ప్రాణాలను కాపాడారు, ఎవరైనా కష్టం అని తన దగ్గరకి వస్తే యూథా చేతులతో తిరిగి పంపే మనస్తత్వం రాజశేఖర్ గారిది.

మంచి అయినా చేదు ఐన మనసులో దాచుకోకుండా మొహం మీదనే చెప్పే వ్యక్తిత్వం గల రాజశేఖర్ కి కరోనా సోకడం అనేది దురదృష్టం అనే చెప్పాలి, ఆయన తొందరగా ఈ మహమ్మారి దాటినుండి పూర్తిగా కోలుకొని మన ముందుకి చిరునవ్వుతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడుకికి ప్రార్థిద్దాము.