ఆటో రామ్ ప్రసాద్ గురించి మీకెవ్వరికి తెలియని కొన్ని సంచలన నిజాలు

By | November 5, 2020

తెలుగు బుల్లితెర పై జబర్దస్త్ కామెడీ షో కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఒక్క కామెడీ షో సుమారు 8 సంవత్సరాల నుండి విరామం లేకుండా ఇప్పటికి టాప్ టీ ఆర్ పీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోవడం అంటే సామాన్యమైన విషయం కాదు అనే చెప్పాలి, ఎంతో మంది ఆణిముత్యం లాంటి కమెడియన్స్ ని మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి అందించింది ఈ షో, ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాణం లో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ పై కొనసాగుతున్న ఈ షో కి తొలుత నాగబాబు మరియు రోజా జడ్జీలుగా వ్యవహరించారు, ఈ ఏడాది ప్రారంబిగం వరుకు నాగబాబు జడ్జి గా కొనసాగాడు, కానీ ఆ తర్వాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి తో కొన్ని విభేదాలు కారణం గా నాగబాబు ఈ షో నుండి తప్పుకున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఇప్పుడు ఆయన స్థానం లో ప్రముఖ సింగర్ మను కొనసాగుతున్నాడు, ఇది ఇలా ఉండగా జబర్దస్త్ షో కి ఇప్పుడు ఇంత స్థాయిలో టీ ఆర్ పీ రేటింగ్స్ రావడానికి ముఖ్య కారణం సుడిగాలి సుధీర్ టీం అని చెప్పొచ్చు.

సుడిగాలి సుధీర్ టీం లో ఆటో రామ్ ప్రసాద్ రాసే ఆటో పంచులు, గెట్ అప్ శ్రీను వేసే విచిత్రమైన గెటప్స్, మరియు సుడిగాలి సుధీర్ చేసే అద్భుతమైన కామెడీ కి రాష్ట్రవ్యాప్తంగా కోట్లలలో అభిమానులు ఉన్నారు,ఈ స్థాయిలో వీళ్ళ స్కిట్స్ పేలడానికి ముఖ్య కారణం ఆటో రామ్ ప్రసాద్ అనే చెప్పొచ్చు, స్క్రిప్ట్ రాయడం దగ్గర నుండి డైలాగ్స్ రాయడం వరుకు మొత్తం ఆటో రామ్ ప్రసాద్ చూసుకుంటాడు , జబర్దస్త్ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రజలకు చేరువ అయినా ఆటో రామ్ ప్రసాద్ జీవితం గురించి మీకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్త్యికరమైన విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము, అక్కినేని నాగ చైతన్య తోలి సినిమా జోష్ ద్వారా వెండితెర కి పరిచయం అయినా ఆటో రామ్ ప్రసాద్, ఆ సినిమా తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడం తో తిరిగి విశాఖపట్నం కి వచ్చి మెడికల్ హోల్ సేల్ బిజినెస్ ని ప్రారంభించాడు.

అప్పుడే ఈటీవీ లో ప్రారంభం కాబోతున్న జబర్దస్త్ కామెడీ షో లో తన స్నేహితుడు ప్రసన్న సహకారం తో జబర్దస్త్ షో కి స్క్రిప్ట్ రైటర్ గా చేరాడు, అప్పట్లో ధన్ రాజ్ టీం కి చాల కాలం వరుకు స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసిన ఆటో రామ్ ప్రసాద్ ఆ తర్వాత సుడిగాలి సుధీర్ టీం కి కూడా స్క్రిప్టులు రాయడం మొదలు పెట్టాడు, స్క్రిప్ట్ రాయడమే కాకుండా సుధీర్ తో కలిసి స్కిట్స్ లో యాక్టింగ్ కూడా చేసిన రామ్ ప్రసాద్ అందరిని ఆకర్షించి ఆ టీం లోనే సుమారు 6 ఏళ్ళ నుండి కొనసాగుతున్నాడు, బుల్లితెర తో అందరికి దగ్గర అయినా రామ్ ప్రసాద్ ఇప్పుడు సినిమాల్లో కూడా బిజీ గా అయ్యి టాప్ కమెడియన్స్ లో ఒక్కరిగా కొనసాగుతున్నాడు, ఇక రామ్ ప్రసాద్ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయనకి పెళ్లి అయ్యి ఇప్పుడు ఒక్క కొడుకు కూడా ఉన్నాడు , వీళ్ళ ఫామిలీ ఫోట్లను మీరు ఎక్సక్లూసివ్ గా క్రింద చూడవచ్చు.