కమెడియన్ సునీల్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవుతారు..

By | November 5, 2020

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంత మంది హాస్య నటులు ఉన్న ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసి చిరస్థాయిగా నిలిచిపోయిన హాస్య నటులు మాత్రం అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు, వారిలో ఒక్కరు సునీల్, సుమారు మూడు దశాబ్దాల నుండి టాలీవుడ్ హాస్య నటులుగా ఒక్క వెలుగు వెలుగుతున్న బ్రహ్మానందం మరియు ఏం ఎస్ నారాయణ హవా కొనసాగుతున్న సమయం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి చిచ్చర పిడుగు లా అడుగు పెట్టి అనతి కాయలం లోనే వాళ్ళిద్దరి స్థాయికి ఎదిగాడు సునీల్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి తేయలీవుడ్ లో అవకాశాల కోసం స్టూడియోస్ చుట్టూ తిరిగి చివరికి ఎట్టకేలకు సినిమాల్లో అతి కష్టం మీద అవకాశాలు సంపాదించుకున్న సునీల్ తొలుత ఇండస్ట్రీ లోకి విలన్ అవుదాం అనే ఉద్దేశ్యం తో వచ్చాడు ,కానీ అతని కామెడీ టైమింగ్ ని గమనించిన దర్శకులు ఆయనకీ కామెడీ రోల్స్ మాత్రమే ఇచ్చారు, అలా కమెడియన్ గా సెటిల్ అయ్యి , హీరో గా కూడా రాణించి శిఖరాగ్ర స్థాయికి చేరుకున్న సునీల్ గురించి మీకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.

కెరీర్ తోలి నాళ్లలో కనీసం జీతం కూడా తీసుకోకుండా పని చేసిన సునీల్ ఇప్పుడు ఒక్క సినిమాలో హీరోగా చేస్తే దాదాపు గా రెండున్నర కోటి రూపాయిలు పారితోషికంగా తీసుకుంటున్నాడు అట, ఇంత మొత్తం చాల మంది యువ హీరోలు కూడా తీసుకోరు అని చెప్పొచ్చు, సునీల్ కి హీరోగా ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కారాన్తమ్ ఆయనకీ హజేరోగా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ రికార్డ్స్ కూడా ఉండడమే, ఆయన హీరోగా నటించిన అందాల రాముడు, మర్యాద రామన్న మరియు పూల రంగడు వంటి సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద ఎలాంటి విజయాలు నమోదు చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కేవలం హిట్ సినిమాలతోనే కాకుండా భీమావరం బుల్లోడు మరియు జక్కన వంటి ప్లాప్ సినిమాలకు కూడా సునీల్ వల్ల బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ కలెక్షన్స్ లభించాయి, అందుకే ఇర్మాతలు ఆయనకీ అంత భారీ మొత్తం లో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కారణం అని చెప్పొచ్చు, ఇక డాన్సులో అయితే సునీల్ రామ్ చరణ్ ,అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్ వంటి హీరోలతో సమానంగా వెయ్యగలడు ,అందుకే ఆయన సినిమాలకు రిసల్ట్ తో సంబంధం లేకుండా ఆడియెన్స్ థియేటర్స్ కి కదులుతారు.

అయితే ఇటీవల సునీల్ హీరోగా నటించిన సినిమాలు అన్ని వరుసగా ప్లాప్స్ అవ్వడం తో ఆయన మళ్ళీ కమెడియన్ గా మన ముందుకి వచ్చాడు, అయితే ఒక్కపుడు సునీల్ ని కమెడియన్ గా జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారో ఇప్పుడు ఆ స్థాయిలో రిసీవ్ చేసుకోట్లేదు అనే చెప్పాలి, దానికి కారణం ఆయన హీరోగా జనాలు ఊహించుకోడమే అని చెప్పొచ్చు, ఇటీవల ఆయన నటించిన కలర్ ఫోటో సినిమా సూపర్ హిట్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే, ఇందులో ఆయన కెరీర్ లో తోలి సారి పూర్తి స్థాయి నెగటివ్ క్యారెక్టర్ లో కనిపించాడు, గతం లో మాస్ మహారాజ రవితేజ హీరో గా వచ్చిన డిస్కో రాజా సిఎంమాలో నెగటివ్ రోల్ లో మెరిసిన సునీల్ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయం పాలవ్వడం తో ఆశించిన స్థాయిలో ఆయనకీ పేరు రాలేదు, కానీ కలర్ ఫొటోస్ సినిమా ద్వారా ఆయనకీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఇప్పుడు ఆయన మరోసారి హీరోగా వేదాంతం రాఘవయ్య అనే సినిమా చేస్తున్నాడు ,ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ స్టోరీ ని అందిస్తున్నాడు, మరి హీరోగా సునీల్ చివరి ప్రయత్నం ఫలిస్తుందో లేదో తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.