శ్రీహరి గురించి బాలయ్య మాట్లాడిన ఈ మాటలు వింటే కన్నీళ్లు ఆపుకోలేరు

By | November 5, 2020

నందమూరి బాలకృష్ణ దర్శకత్వం వహిస్తూ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘నర్తనశాల’, మహా భారతం ఇతిహాసం లోని పాండవులు అజ్ఞాతవాసం లో భాగంగా విరాట రాజ్యం లో గుప్తంగా ఉండే ఘట్టాన్ని అప్పట్లో స్వర్గీయ నందమూరి తారక రామ రావు తో అద్భుతంగా తీశారు దర్శకుడు కమలాకర కామేశ్వర రావు, ఈ సినిమా లో ఎన్టీఆర్ అర్జునిడి పాత్ర లో ఎంత ద్భుతంగా నటించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమాని 2004 వ సంవత్సరం లో నందమూరి బాలకృష్ణ తన స్వీయ దర్శకత్వం లో నటిస్తూ ఈ సినిమాని అట్టహాసంగా ప్రారంభించారు, తన డ్రీం ప్రాజెక్ట్ ని ఎక్కడ తగ్గకుండా అద్భుతమైన స్టార్ కాస్టింగ్ ని కూడా ఎంచుకున్నాడు బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య ని ,భీముడిగా రియల్ స్టార్ శ్రీహరి ని మరియు ధర్మరాజు గా శరత్ బాబు ని ఎంచుకున్నాడు, సినిమా కొంత భాగం షూటింగ్ కూడా చేసాడు, కానీ దురదృష్టం కొద్దీ ఈ సినిమాలో నటిస్తున్న సౌందర్య హెలికాప్టర్ ప్రమాదం లో మరణించగా షూటింగ్ ని మధ్యలోనే ఆపేసాడు బాలకృష్ణ.

అయితే ఇటీవల షూట్ చేసిన పార్ట్ ని ఓ టీ టీ ప్లాటుఫారం మీద ఇటీవలే బాలకృష్ణ విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, సుమారు 17 నిముషాలు నిడివి గల ఈ సినిమాకి ఆటు అభిమానుల నుండి ,ఇటు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది, స్వర్గస్తులు అయినా టాలీవుడ్ దిగ్గజాలు సౌందర్య మరియు శ్రీహరి ని మరోసారి ఈ సినిమా ద్వారా కళ్లారా చూసే అవకాశం అందరికి దక్కింది, ఈ సినిమాని పూర్తి గా తీసి అప్పట్లో విడుదల చేసి ఉంటే బాలకృష్ణ కెరీర్ లో ఒక్క మైలు రాయిగా ఈ సినిమా మిగిలిపొయ్యేది అని సినీ విశ్లేషకులు పొగడ్తల వర్షం కురిపించారు, ఈ 17 నిమిషాల సినిమా జనాలకి నచ్చితే పూర్తి సినిమా తీస్తాను అని చెప్పిన బాలకృష్ణ ఇప్పుడు మరి తీస్తారో లేదో చూడాలి,ఇది ఇలా ఉండగా ఇటీవల నందమూరి బాలకృష్ణ ఈ సినిమాకి సంబంధించి చాల ఇంటర్వ్యూలు ఇచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ ఇంటర్వ్యూ లో ఆయన రియల్ స్టార్ శ్రీహరి గురించి మనకెవ్వరికి తెలియని కొన్ని విషయాలు చెప్పగా అవి ఇప్పుడు సోషల్ మీడియా అంతంత తెగ వైరల్ గా మారాయి.

బాలకృష్ణ శ్రీహరి గారి గురించి మాట్లాడుతూ ‘నాకు ఇండస్ట్రీ లో చాల తక్కువ మంది స్నేహితులు ఉంటారు, వారిలో ఒక్కరు శ్రీహరి గారు, ఆయన ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతారు నాలాగే,ఈ సినిమాలో భీముడి పాత్ర కోసం నేను శ్రీహరి గారిని తప్ప ఎవ్వరిని సంప్రదించలేదు, ఎందుకంటే ఆ పాత్రకి సరైన సరైన శరీరాకృతి మరియు అద్భుతమైన నటన ప్రతిభ నాకు శ్రీహరి గారిలోనే కనిపించాయి, అందుకే నేను వెంటనే ఆయనకి ఫోన్ చేసి అడిగాను, ఇలా భీముడికి పాత్ర ఉంది తమ్ముడు, అది నువ్వే చెయ్యాలి, నీకు చాల మంచి పేరు వస్తుంది, ఈ సినిమా తర్వాత నీ భవిష్యత్తు మారిపోతుంది అని చెప్పాను, ఆయన వెంటనే ఒప్పుకొని ఈ సినిమా చేసారు, అనుకున్నట్టే ఆయన ఈ సినిమా తర్వాత పూర్తి స్థాయి హీరోగా స్థిర పడ్డారు, టాలీవుడ్ కి ఒక్క గిఫ్ట్ లాంటోడు మన శ్రీహరి గారు, ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం అనేది మన దురదృష్టం’ అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.