టాలీవుడ్ లో ఆ హీరో అంటే సచ్చేంత ఇష్టం

By | November 6, 2020

ప్రపంచ నలుమూలల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా చూసే ఏకైక క్రీడా క్రికెట్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది దిగ్గజ క్రికెటర్స్ ఉన్న కొంత మంది క్రికెటర్స్ ని ఆయా దేశం వాళ్ళు దేవుళ్ళు లాగ, మరియు తమ దేశ ప్రతిష్ట లాగ భావిస్తారు, అలా మన దేశం లో ఒక్క క్రికెటర్ ని దేవుడి లెక్క ఆరాధించడం మొదలయింది సచిన్ టెండూల్కర్ తో ,ఆ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ ని తెచ్చుకున్న మరో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, వీళ్లిద్దరి తో సమానం గా దేశ ప్రతిష్టని శిఖరాగ్ర స్థాయికి చేరుస్తు, ప్రపంచం లోనే ది బెస్ట్ బాట్ మ్యాన్ గా చరిత్రకి ఎక్కినా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ, గల్లీ క్రికెటర్ నుండి అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగి దేశ ప్రతిష్టని ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందేలా చేసిన విరాట్ కోహ్లీ ఒక్క ప్రయాణం ప్రతి ఒక్క యువకుడికి ఒక్క ఆదర్శం అని చెప్పొచ్చు, ఈరోజు తో ఆయన తన 32 వ సంవత్సరం లోకి అడుగు పెట్టిన విరాట్ కోహ్లీ గురించి ఈరోజు మేము ప్రత్యేక కథనం మీకు అందచేస్తున్నాము.

1988 వ సంవత్సరం ఢిల్లీ లో జన్మించిన విరాట్ కోహ్లీ తండ్రి పేరు ప్రేమ్ కోహ్లీ, ఆయన ఒక్క క్రిమినల్ లాయర్ , ఇక విరాట్ కోహ్లీ తల్లి పేరు సరోజ్ కోహ్లీ, విరాట్ కోహ్లీ కి ఒక్క అన్నయ్య మరియు అక్క ఉన్నారు, విరాట్ కోహ్లీ కి మూడు సంవత్సరాల వయస్సు నుండే క్రికెట్ అంటే అమితాసక్తి ఉండేది , తన తండ్రి ప్రేమ్ కోహ్లీ తో కలిసి ఆయన ఇంట్లో తరుచు క్రికెట్ ఆడుతుండేవాడు అట , ఇక ఆయన విద్యాబ్యాసం విషయానికి వస్తే ఉత్తమ్ నగర్ లోని విశాల్ భారతి పబ్లిక్ స్కూల్ లో తన ప్రాథమిక విద్యాబ్యాసం ని పూర్తి చేసుకున్నాడు, ఆయనకీ 9 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే అతనిలోని టాలెంట్ ని స్పార్క్ ని గమనించి వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీ వాళ్ళు కోహ్లీకి బ్యాట్స్ మ్యాన్ గా ఒక్క అవకాశం ఇచ్చారు,అతని ఆట తీరుని గమనించిన కోచ్ కోహ్లీ తండ్రిని పిలిపించి ఇతనిలో అద్భుతమైన టాలెంట్ ఉంది, ఇతని టాలెంట్ గల్లీ క్రికెట్ కి మాత్రమే పరిమితం కాకూడదు, రాజ్ కుమార్ శర్మ అనే ప్రముఖ క్రికెట్ కోచ్ కి కోహ్లీ ని అప్పచెప్పండి అని సలహా ఇవ్వడం కోహ్లీ ని అతని తండ్రి రాజ్ కుమార్ శర్మ దగ్గర శిక్షణ లో చేర్చాడు, రాజ్ కుమార్ శర్మ ప్రోత్సహంతో కోహ్లీ సుమీత్ డోగ్రా అకాడమీ ద్వారా ఎన్నో మ్యాచులు ఆడాడు, అలా క్రికెట్ లో రాటు దేలుతూ రంజీ మ్యాచులు ఎన్నో ఆది ఇండియన్ క్రికెట్ టీమ్ కి సెలెక్ట్ అయ్యి ఈరోజు ఒక్క మంచి కెప్టెన్ గా మరియు వరల్డ్ బెస్ట్ బ్యాట్స్ మ్యాన్ గా మన ముందు ఉన్నాడు కోహ్లీ.

ఇక కోహ్లీ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన బాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శర్మని వివాహం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే, త్వరలోనే వీళ్ళకి ఒక్క పాపా కానీ ,బాబు కానీ పుట్టబోతున్నాడు, ఇక కోహ్లీ ఇష్టాయిష్టాల విషయానికి వస్తే కోహ్లీ కి చిన్నపాటి నుండి బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ అంటే విపరీతమైన ఇష్టం ఉండేది అట, అలాగే టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలు విపరీతంగా చూసేవాడు అట, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న కూడా కోహ్లీ కి చిన్నప్పటి నుండి ఐశ్వర్య రాయి అంటే చాల ఇష్టం ఉండేది అట, అలాగే క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ తనకి రోల్ మోడల్ అవ్వగా , టెన్నిస్ లో రోగర్ ఫెదరర్ కి వీబీరాభిమాని అట, ప్రస్తుతం ఐ పీ ఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం తరుపున ఆడుతున్న కోహ్లీ , తన సారథ్యం లో టీం ని ప్లే ఆప్స్ కి తీసుకొని వచ్చాడు, ప్లే ఆప్స్ లో రాబొయ్యే మాటచెస్ అన్ని గెలిచి ఐ పీ ఎల్ ట్రఫీ ఈసారి ఎలా అయినా గెలవాలని మానసపోర్టిగా కోరుకుంటూ కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.