పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న ఈ ముసలాయన ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

By | November 6, 2020

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సుమారు మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత చేస్తున్న చిత్రం వకీల్ సాబ్, బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయినా అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాకి రీమేక్ గా రాబోతున్న ఈ సినిమా కి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు, గత ఏడాదిలో షూటింగ్ ని ప్రారంబించుకున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకొని రావాలని నిర్మాత దిల్ రాజు ప్రయత్నం చేసాడు, కానీ కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ వల్ల ఈ సినిమాకి ఇన్ని రోజులు తాత్కాలికంగా విరామం ఇచ్చారు, కానీ ఇన్ని రోజుల విరామం తర్వాత ఈ సినిమా షూటింగ్ గత నెలలో ప్రారంభం కాగా పవన్ కళ్యాణ్ ఈ నెల 1 వ తేదీ నుండి సెట్స్ లోకి వచ్చాడు, ఎలా అయినా ఈ సినిమాని 2021 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకోచేందుకు సన్నాహాలు చేస్తున్నాడు అట.

ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఈరోజు మియాపూర్ మెట్రో స్టేషన్ లో సడన్ గా దర్శనం ఇచ్చాడు, వకీల్ సాబ్ సినిమా షూటింగ్ కి సంబంధించి కొన్ని సన్నివేశాలను మెట్రో స్టేషన్ లో తీసేందుకు దిల్ రాజు ప్లాన్ చెయ్యగా ఈరోజు తెల్లవారుజామున కొన్ని షాట్స్ ని పవన్ కళ్యాణ్ పై తెరకెక్కించారు,పవన్ కళ్యాణ్ స్టేషన్ లో ఉన్నాడు అనే వార్త తెలిస్తే అభిమానుల తాకిడి విపరీతంగా ఉంటుంది అని గమనించిన దిల్ రాజు , ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచి తెల్లవారిన షూటింగ్ ని పూర్తి చేసి ప్యాక్ అప్ చెప్పేసాడు, షూటింగ్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ తన సొంత కారులో కాకుండా మెట్రో రైలు లో మాదాపూర్ వరుకు ప్రయాణించి అక్కడ నుండి తన కారులో ఇంటికి తిరిగి వెళ్లారు, మెట్రో రైలు లో ఆయన ఒక్క ముసలాయనతో మాట్లాడున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది, ఇంతకీ ఆ ముసలాయన ఎవరు అనే దాని పై సోషల్ మీడియా లో చర్చ కొనసాగుతూ ఉంది, అయితే ఆయన కేవలం ఒక్క సాధారణ రైతు అని, పవన్ కళ్యాణ్ ఆయన పంట గురించి మరియు ఆయన బాగోగులు గురించి ఒక్క తోటి ప్రయాణికుడిగా అడిగి తెలుసుకున్నాడు అని జనసేన పార్టీ నాయకులూ తెలిపారు.

ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఒక్క పక్క షూటింగ్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతూనే మరోపక్క షూటింగ్ విరామం సమయాల్లో జనసేన పార్టీ పనుల్లో నిమగ్నమయ్యారు, ఆయన త్వరలో హైదరాబాద్ లో జరగబొయ్యే జీ హెచ్ ఏం సి ఎన్నికలకు జనసేన పార్టీ ని సిద్ధం చేస్తూ కమిటీలను నియమిస్తున్నారు, ఇలా ఆయన రాజకీయాలు మరియు సినిమాలు అంటూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ క్షణం తీరిక లేకుండ గడుపుతున్నాడు, ఇక వకీల్ సాబ్ సినిమా తర్వాత ఆయన ఏకంగా నాలుగు సినిమాలకు సైన్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, ఒక్కటి డైరెక్టర్ క్రిష్ తో తియ్యబోయ్యే పీరియడ్ సినిమా కాగా మరొక్కటి గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో త్యియ్యబొయ్యే సినిమా ,ఇందులో క్రిష్ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యి కొంతహా భాగం షూటింగ్ ని పూర్తి చేసుకోగా హరీష్ శంకర్ సినిమా ప్రారంభం కావాల్సి ఉంది, వీటితో పటు ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి తో మరియు నూతన దర్శకుడు సాగర్ చంద్ర తో కూడా సినిమాలు చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇవి కాకుండా కొరటాల శివ లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో మరో సినిమా కూడా చేసే అవకాశం ఉంది అని ఫిలిం నగర్ లో గట్టిగ వినిపిస్తున్న వార్త, మరి అత్తారింటికి దారేది సినిమా తర్వాత సరైన హిట్ లేకుండా ఉన్న పవన్ కళ్యాణ్ కి రాబొయ్యే సిఎంమాలు భారీ హిట్స్ ని అందిస్తుందా లేదా అనేది తెలియాలి అంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.