కీర్తి సురేష్ తల్లి ఒక్కప్పుడు ఎంత పెద్ద హీరోయినో తెలుసా??

By | November 7, 2020

తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే కాదు ఏ ఇండస్ట్రీ లో అయినా సినీ వారసత్వం సర్వ సాధారణం అనే విషయం మన అందరికి తెలిసిందే, కొంత మంది సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన కూడా తమ సొంత టాలెంట్ తో కస్టపడి సూపర్ స్టార్స్ గా ఎదిగారు, మరి కొంత మంది గొప్ప సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన కూడా రెండు మూడు సినిమాలు చేసి ప్రేక్షకుల ఆదరణ లభించకపోవడం తో సక్సెస్ కాలేకపోయారు, మన టాలీవుడ్ లోనే అలా ఎంతో మందిని మన కళ్లారా చూసాము, ఇటీవల కలం లో అయితే స్టార్ హీరోలు మరియు స్టార్ హీరోయిన్ల కుటుంబాల నుండి సినీ వారసులు వరుసగా క్యూ కడుతున్న సంగతి మన అందరికి తెలిసిందే, అయితే ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ కూడా ఒక్క ప్రముఖ టాలీవుడ్ టాప్ హీరోయిన్ కి కూతురు అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా, ఇప్పుడు ఆమె ఎవరో , ఇప్పటి వరుకు ఎన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించిందో ఇప్పుడు ఈ కథనం లో మనం చూడబోతున్నాము.

కీర్తి సురేష్ తల్లి పేరు మేనకా సురేష్ కుమార్, ఈమె తమిళ్ లో 1980 వ సంవత్సరం లో విడుదల అయినా ‘రమాయి వయసుకు వంతుట్ట’ అనే సినిమా ద్వారా వెండితెర కి పరిచయం అయ్యారు, ఆ తర్వాత 1980 వ సంవత్సరం నుండి 1986 వ సంవత్సరం వరుకు కేవలం ఆరు ఏళ్లలో తెలుగు , తమిళం , మలయాళం మరియు కన్నడ బాషలలో కలిపి ఏకంగా 116 సినిమాలలో హీరోయిన్ గా నటించింది అంటే అప్పట్లో ఆమె ఎంత పెద్ద టాప్ హీరోయినో అర్థం చేసుకోవచ్చు, ఇప్పటికి అంత తక్కువ టైం లో వందకి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఏకైక ఆర్టిస్ట్ రికార్డు గా చరిత్రకి ఎక్కినా హీరోయిన్ గా ఈమె ఒక్కటే ఉంది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, ఈమె తెలుగు లో అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన పున్నమి నాగు అనే సినిమాలో కూడా నటించింది, కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయం లోనే ప్రముఖ నిర్మాత జి.సురేష్ కుమార్ ని పెళ్ళాడి సినిమాలకి శాశ్వతంగా గుడ్ బాయ్ చెప్పేసింది, అయితే సుమారు 19 సంవత్సరాల విరామం తర్వాత ఆమె తమిళ్ లో కలివీడు అనే సీరియల్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది, చిన్నప్పటి నుండి నటన మీద ఆసక్తి ఉన్న తన కూతురు కీర్తి సురేష్ ని అప్పట్లోనే ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటింపచేసింది, ఆ తర్వాత ఆమె 2013 వ సంవత్సరం లో మలయాళం లో విడుదల అయినా గీతాంజలి సినిమా ద్వారా లీడ్ రోల్ చేసింది, తోలి సినిమాతోనే ఆమె నెగటివ్ రోల్ లో అందరిని మెప్పించింది, ఇక ఆ తర్వాత కీర్తి సురేష్ సినీ ప్రస్థానం ఏ స్థాయికి వెల్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఇటీవల ఆమె నటించిన పెంగ్విన్ మరియు మిస్ ఇండియా సినిమాలు ఓ టీ టీ ఫ్లాట్ ఫోరమ్ లో విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమాల తర్వాత ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది, దీనితో పాటు ఆమె నితిన్ హీరోగా నటిస్తున్న రంగ్ దే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది, మహానటి సినిమాతో తన అద్భుతమైన నటన తో అందరిని ఆకర్షించిన కీర్తి సురేష్ , ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించడం తో ఆ తర్వాత ఆమె ఎక్కువగా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది, అయితే అవి సరిగా కలిసి రాకపోవడం తో సర్కారు వారి పాట సినిమా నుండి ఇక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకి టాటా చెప్పి కేవలం హీరోయిన్ గా మాత్రమే కొనసాగాలి అని నిర్ణయించుకుంది అట, మరి సౌత్ ఇండియా లోనే టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ భవిష్యత్తులో ఏ స్థాయిలోకి వెళ్తుందో తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడక తప్పదు.