జగపతి బాబు మాట్లాడినా ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు

By | November 7, 2020

టాలీవుడ్ లో ఒక్కపుడు స్టార్ హీరోలుగా ఒక్క వెలుగు వెలిగి ఎన్నో సంవత్సరాలు టాప్ హీరోలుగా కొనసాగి ఆ తర్వాత ఇండస్ట్రీ లో ఫేడ్ అవుట్ అయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మరియు విలన్స్ గా మారి ఇప్పటికి మంచి డిమాండ్ ఉన్న నటులుగా గా కొనసాగుతున్నారు, వారిలో ఒక్కరు జగపతి బాబు, ఈయన ఒక్కపుడు ఎంత హీరోనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అలనాటి హీరో శోభన్ బాబు తర్వాత ఆ స్థాయిలో ఫామిలీ ఆడియెన్స్ లో మరియు లేడీస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు జగపతి బాబు మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, హీరోగా సుమారు 70 సినిమాల్లో నటించిన ఈయన నందమూరి బాలకృష్ణ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వం లో వచ్చిన సెన్సషనల్ బ్లాక్ బస్టర్ లెజెండ్ సినిమా ద్వారా కెరీర్ లో తొలిసారి విలన్ గా వెండితెర కి పరిచయం అయ్యాడు, ఆ సినిమా తర్వాత జగపతి బాబు విలన్ గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏ స్థాయిలో టాలీవుడ్ లో స్థిరపడిపొయ్యాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఇప్పుడు సౌత్ లో ఆయన లేని సినిమా అంటూ ఏది లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

హీరోగా నా పని అయిపోయింది , ఇక నాతో సినిమాలు చెయ్యడానికి ఎవ్వరు ముందుకు రారు , ఇక కుటుంబం ని నేను ఎలా పోషించాలి అని బాధపడుతున్న సమయం లో లెజెండ్ సినిమా నాకు పునర్జన్మ ఇచ్చింది అనే చెప్పాలి, నాకు ఈ రేంజ్ బ్రేక్ ఇవ్వడానికి కారణం అయినా బోయపాటి శ్రీను గారికి నేను ఎల్లపుడు కృతజ్ఞతుడనై ఉంటాను అంటూ జగపతి బాబు ఎన్నో సందర్భాలలో చెప్పిన సంగతి మన అందరికి తెలిసిందే, లెజెండ్ సినిమా తర్వాత జగపతి బాబు రేంజ్ ఏ స్థాయిలో మారిపోయింది అంటే ఆయన వల్ల ప్రకాష రాజ్ వంటి నటుల సిఎంమా అవకాశాలకు గండి పడేస్థాయిలో మారిపోయింది, ఇప్పుడు జగపతి బాబు ఒక్కో సినిమాకు గాను రెండు కోట్ల రూపాయలకు పైగానే పారితోషికం తీసుకుంటున్నాడు అట, ఇది ఇలా ఉండగా జగపతి బాబు కి సంబంధించిన ఒక్క వార్త ఇటీవల సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

ఇక అసలు విషయానికి వస్తే జగపతి అప్పట్లో టాప్ హీరోయిన్ గా కొసనగాతూన్న సౌందర్య ని ప్రేమించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే ఎన్నో ఇంటర్వ్యూలలో తెలిపాడు, ఆమె చనిపోయిన తర్వాత జగపతి బాబు ఆ బాధ నుండి కోలుకోడానికి సుమారు నాలుగు ఏళ్ళు పట్టింది అట, ఇప్పటికి జగపతి బాబు సౌందర్య గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనకీ తెలియకుండానే కళ్ళలో నుండి నీళ్లు రావడం మనం గమనించొచ్చు, అయితే తానూ సౌందర్య ని ఆ స్థాయిలో ప్రేమించాను అనే విషయం జగపతి బాబు భార్య కి తెలుసు అట, సౌందర్య చనిపోయాక నేను పడుతున్న బాధని చూసి తన భార్య ఎంతో బాధపడమే కాకుండా ఆయనని ఓదార్చింది కూడా అట, నేను ఆ బాధ నుండి కోలుకొని ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాను అంటే నా భార్యే కారణం అంటూ జగపతి బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.