రాజీవ్ కనకాల మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు

By | November 8, 2020

తెలుగు బుల్లితెర పై టాప్ యాంకర్ ఎవరు అంటే టక్కుమని గుర్తొచ్చే పేరు సుమ, ఎంతో మంది అప్ కింగ్ యాంకర్లకు ఈమె ఒక్క రోల్ మోడల్ అనే చెప్పొచ్చు, తన హుషారైన మాటలతో మరియు ఆటలతో ఇప్పటికి నెంబర్ 1 యాంకర్ గా కొనసాగుతుంది సుమ ,ఈమె లేని టాలీవుడ్ టాప్ హీరో ఈవెంట్ అంటూ ఏది లేదు అని చెప్పడం లో ఏ మాత్రం అతిసయోక్తి లేదు, ఈమె ప్రముఖ టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే, వీరిద్దరికి పెళ్లి అయ్యి సుమారు 11 సంవత్సరాలు అయ్యింది,టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ జంటలలో వీరిది కూడా ఒక్కటి అని చెప్పొచ్చు, అయితే ఇటీవల వీళ్లిద్దరు విడిపోతున్నారు అని సోషల్ మీడియా లో గాసిప్ రాయుళ్లు గత కొద్దీ రోజుల క్రితం తెగ హల్చల్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, అయితే ఆ గాసిప్పు రాయుళ్ళకి దిమ్మ తిరిగిపొయ్యెలా సమాధానం ఇస్తూ ఇటీవల సుమ మరియు రాజీవ్ కనకాల ఈ టీవీ లో చేసిన ఒక్క షో అందరి నోర్లను మూయించినట్టు అయ్యింది.

ఇది ఇలా ఉండగా ఇటీవల రాజీవ్ కనకాల పేస్ బుక్ లైవ్ ద్వారా తన అభిమానులతో పంచుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారింది, ఆయన మాట్లాడుతూ ‘ అప్పట్లో మేఘమాల అనే సీరియల్ ని మా నాన్న దేవదాస్ కనకాల గారు తీశారు, ఇందులో హీరోయిన్ సుమ, అందులో నాది చాలా చిన్న పాత్ర, మేఘమాల సీరియల్ కి ముందే నేను సుమ ని చూసాను,ఒక్కసారి నేను డైరెక్ట్ చేసిన సీరియల్ కోసం ఎడిట్ షూట్ కి వెళ్లాను, అదే సమయం లో సుమ కూడా అక్కడికి వచ్చింది, ఆమెను చూసిన వెంటనే చాలా ఇంప్రెస్స్ అయ్యాను, ఆమెని చూసిన వెంటనే నేను మనసు పారేసుకున్నాడు, ఆ తర్వాత ధైర్యం చేసుకొని కొన్ని రోజుల తర్వాత ఆమెకి ప్రపోజ్ చేశాను, తొలుత ఒప్పుకోదు ఏమో అనుకున్నాను, కానీ న అదృష్టం, మూడు రోజుల తర్వాత ఆమె ఫోను చేసి నాకు కూడా ఇష్టమే అని చెప్పింది, ఇద్దరు ఓకే అనుకోని లవ్ లో పడిన ఆరు నెలల తర్వాత మా ప్రేమ కి బ్రేక్ పడింది,అప్పట్లో నేను సుమ కి ఈ సమయం లో సినిమాలు లాంటివి ఒద్దు అని చెప్పను, పెళ్లి కి ముందే ఆంక్షలు పెడుతున్నాడు అని సుమ నా లవ్ కి బ్రేక్ అప్ చెప్పేసింది, ఆ తర్వాత నేను ఎంత నచ్చచెప్పినా తాను ఒప్పుకోలేదు, అలా బ్రేక్ అప్ అయినా ఒక్క సంవత్సరం తర్వాత టీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి, ఆ సమయం లో అందరూ మా ఇంటికి వచ్చేవారు, ఆలా సుమ తో నేను మల్లి కలిసాను, ఈ ఎన్నికలలో సుమ ఓడిపోయింది, ఆ తర్వాత మేము మాట్లాడుకున్నాం, ఇక మా ప్రేమ సంగతి ఇంట్లో వాళ్లకి చెప్పాము, తొలుత సుమ ఇంట్లో వాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకోలేదు, మా సినిమా కల్చర్ వేరు కదా , మా నాన్న బ్యాక్ గ్రౌండ్ కూడా వాళ్లకి తెలియదు, కాబట్టి వాళ్ళు సినిమా వాళ్ళతో పెళ్లి వద్దు అన్నారు, ఆ తర్వాత వాళ్ళ సన్నిహితులు అందరూ మాట్లాడి ఒప్పించడం తో మా పెళ్లి ఎట్టకేలకు జరిగి ఇప్పటితో 11 ఏళ్ళు అయ్యింది’ అంటూ మాట్లాడారు రాజీవ్ కనకాల.

ఇది ఇలా ఉండగా రాజీవ్ కనకాల మరియు సుమ బుల్లితెర మీద మరియు వెండితెర మీద యాంకర్ గా మరియు నటులుగా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే, వీళ్లిద్దరి కుమారుడు రోషన్ కనకాల తావరలోనే హీరోగా వెండితెర కి పరిచయం కాబోతున్నాడు, నూతన దర్శకుడు రమణ లోక వర్మ దర్శకత్వం లో రోషన్ హీరోగా రాబోతున్న ఈ సినిమాకి అనంతం అనే టైటిల్ ని ఖరారు చేసారు, ఇప్పటికే రోషన్ శ్రీకాంత్ తనయుడు రోహన్ హీరోగా పరిచయం అవుతూ వచ్చిన తోలి సినిమా నిర్మల కాన్వెంట్ ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు, అందులో ఆయనది చిన్న క్యారెక్టర్ అయినా మంచి గుర్తింపు వచ్చింది, ఇప్పుడు రోషన్ పూర్తి స్థాయి హీరోగా మన ముందుకి రాబోతున్నాడు, ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా టాలీవుడ్ కి చెందిన కొంత మంది ప్రముఖుల సమక్షం లో లాంఛనంగా ప్రారంభం అయ్యింది.